Andhra Pradesh: దాడులకు వస్తున్న ఐటీ అధికారులకు భద్రత కల్పించకూడదని ఏపీ కేబినెట్ నిర్ణయం

  • సోదాలకు వచ్చిన ఐటీ అధికారులకు పోలీసు భద్రతకు నో
  • నేడు అడ్వకేట్ జనరల్‌తో సమావేశం
  • ఒకే సామాజిక వర్గం లక్ష్యంగా దాడులు

శుక్రవారం రాత్రి నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులకు  పోలీసు భద్రత కల్పించకూడదని కేబినెట్ నిర్ణయించింది. అయితే, న్యాయశాఖ కార్యదర్శి సలహా తీసుకున్న తర్వాత ఈ విషయంలో ముందుకెళ్లాలని మంత్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఈ విషయంలో నేడు అడ్వకేట్ జనరల్‌తో సమావేశం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఏపీపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఒకే సామాజిక వర్గం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, కేంద్రంపై అన్ని స్థాయుల్లోనూ పోరాడాలని కేబినెట్ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News