Kamal Haasan: ఈ పాట నాకొక మధుర జ్ఞాపకం కాబోతోంది: శ్రుతి హాసన్

  • ట్రాక్ సృజనాత్మకతతో నిండి ఉంటుంది
  • న్యూక్రియాతో పనిచేయడం నా అదృష్టం
  • ఆయనకు ఎప్పుడూ అభిమానినే..

చాలా గ్యాప్ తర్వాత ‘శభాష్ నాయుడు’ చిత్రం ద్వారా తెలుగు తెరపై మెరవబోతున్న కథానాయిక శ్రుతి హాసన్. ఈ చిత్రంలో తండ్రి కమల్ హాసన్‌తో కలిసి ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఇదిలా ఉంచితే, చక్కని గాయనిగా కూడా అమ్మడికి మంచి పేరుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓ ప్రత్యేక పాట రికార్డింగ్ కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ న్యూక్లియా (ఉద్యాన్ సాగర్)తో కలిసి పనిచేయబోతోంది.

శ్రుతి తన నైపుణ్యంతో తనను ఆశ్చర్యపరిచిందని న్యూక్లియా అన్నారు. ‘గాయనిగా, రచయిత్రిగా శ్రుతి రాణిస్తున్నారు. ఈ ట్రాక్(పాట) లిరిక్స్‌ను ఆమె రాశారు. అద్భుతంగా ఉండబోతోంది’ అని న్యూక్లియా తెలిపారు. ఈ సందర్భంగా శ్రుతి తన ఆనందాన్ని పంచుకుంది. ‘‘ఈ బృందంతో కలిసి పనిచేయడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. మా ట్రాక్ సృజనాత్మకతతో నిండి ఉంటుందని భావిస్తున్నా. న్యూక్లియాతో పనిచేయడం నా అదృష్టం. ప్రజల్ని ఆయన మెప్పించిన తీరు అద్భుతం. ఆయనకు ఎప్పుడూ నేను అభిమానినే. ఇది నాకొక మధుర జ్ఞాపకం కాబోతోంది’’ అని తెలిపింది.

Kamal Haasan
sruthi hasan
sabhash naidu
nukria
  • Loading...

More Telugu News