Chandrababu: చంద్రబాబు ఏం చేశాడు? గుండెల మీద గుద్దాడు!: సీఎం కేసీఆర్
- నాడు బాబు పునాదిరాళ్లు పాతాడు..పనులు చేయలేదు
- తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ ఆంధ్రోళ్లకప్పగిస్తామా?
- ఏమరుపాటుగా ఉంటే ఈ గద్దలు మళ్లీ తన్నుకుపోతాయి
సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాను చంద్రబాబు తొమ్మిదేళ్లు దత్తత తీసుకుని ఏమీ చేయలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. వనపర్తిలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘గుండెల మీద గుద్దాడు! పునాదిరాళ్లు పాతిపోయాడు. పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడల్లా నేను ఉపన్యాసాల్లో చెప్పేది.. ఈ సమైక్య పాలకులు పాతిన పునాదిరాళ్లను తీసుకుపోయి కృష్ణానదిలో పడేస్తే పెద్ద డ్యామ్ తయారవుతుంది.
శిలాఫలకాలు వేశారు తప్ప, పనులు చేయలేదు. ఇటువంటి దుర్మార్గుడు. ఈరోజున తెలంగాణ కాంగ్రెస్ నీచాతి నీచంగా దిగజారిపోయి చంద్రబాబునాయుడును తెస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ ఆంధ్రా వాళ్లకు అప్పగిస్తామా? తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగాలా? ఢిల్లీలో జరగాలా? పట్టువీడితే ఉన్న గోసీ ఊడిపోతుంది. మళ్లీ మొదటికొస్తాం..ఆగమైపోతాం. మీ బిడ్డగా మనవి చేస్తున్నా.. ఏమరుపాటుగా ఉంటే ఈ గద్దలు మళ్లీ తన్నుకుపోతే మళ్లీ భయంకరమైన పరిస్థితులొస్తాయి’ అని అన్నారు.