kcr: డీకే అరుణ! ఒళ్లు దగ్గర పెట్టుకో.. నీ బండారం, చరిత్ర బయటపెడతా: కేసీఆర్ వార్నింగ్

  • పాలమూరు అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడింది
  • ఇలాంటి నాయకులను ఇక్కడి ప్రజలు మళ్లీ కోరుకోవద్దు
  • ‘హంద్రీ నీవా’ను తవ్వుకుపోతామన్న రఘువీరాకు మంగళహారతులు పట్టింది  

పాలమూరు అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి, డీకే అరుణ అడుగడుగునా అడ్డుపడ్డారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, నాడు సమైక్య పాలనలో హంద్రీ నీవా కాల్వ నుంచి నీళ్లు పట్టుకుపోతామని రఘువీరారెడ్డి అంటే, ఆయనకు మంగళహారతులు పట్టింది డీకే అరుణ అని, ఈ సాక్ష్యాలన్నీ తమ వద్ద ఉన్నాయని ప్రస్తావించారు. దారుణ వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ బండారం, చరిత్ర బయటపెడతామని కేసీఆర్ హెచ్చరించారు.

నాడు పాలమూరును ఎండబెట్టి, వలస జిల్లా చేసి, పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి నీళ్లను
రాజశేఖర్ రెడ్డి తీసుకుపోయాడని నిప్పులు చెరిగారు. పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లు తీసుకుపోవడం కరెక్టేనని, దీని వల్ల నష్టమేమి ఉండదని చిన్నారెడ్డి నాడు చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు. చిల్లర మంత్రి పదవి కోసం నాడు సమైక్య పాలకులను చిన్నారెడ్డి సమర్ధించాడని, ఇలాంటి నాయకులను ఇక్కడి ప్రజలు మళ్లీ కోరుకోవద్దని సూచించారు.

kcr
dk aruna
Wanaparthy District
  • Loading...

More Telugu News