smart phone: డేటా సేవింగే ప్రధాన ఉద్దేశంగా... ట్విట్టర్ కొత్త అప్‌డేట్!

  • డేటాను ముందే సెట్ చేసుకోవచ్చు
  • వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే కావు
  • దృష్టి లోపం ఉన్నవారికి స్పెషల్ ఫీచర్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న చాలామంది ట్విట్టర్‌లో అకౌంట్ కలిగి ఉంటున్నారు. దీంతో ట్విటర్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్ ఐఓఎస్ మొబైల్ వాడుతున్న వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. దీని ప్రకారం, యూజర్లు  ట్విట్టర్ కోసం ఎంత డేటా వాడుకోవాలనుకుంటున్నారో అంతే వాడుకోవచ్చు. అలాగే దృష్టి లోపం ఉన్నవారు కూడా సులువుగా ట్విట్టర్‌ను వినియోగించేలా ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.

ట్విట్టర్ కొత్త అప్‌డేట్ ప్రధాన ఉద్దేశం డేటా సేవింగ్. బ్రౌజింగ్ చేసేటప్పుడే వినియోగదారులు తాము ఎంత డేటా కేటాయించాలనుకుంటున్నారో సెట్టింగ్స్‌లో ముందుగానే సెట్ చేసుకునే అవకాశాన్ని ట్విట్టర్ కల్పించింది. దీని కారణంగా వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే కావు. అలాగే ఫోటోలు కూడా తక్కువ రిజల్యూషన్‌తో కనిపిస్తాయని సంస్థ వెల్లడించింది. దృష్టి లోపం ఉన్నవారు కూడా ఇకపై అత్యంత సులువుగా ట్విట్టర్ వాడుకునేలా ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం వాయిస్ ఓవర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ అప్‌డేట్‌ను ఐ ఫోన్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి పొందవచ్చని సూచించింది.

  • Loading...

More Telugu News