Telangana: తెలంగాణ ఓటర్ల జాబితా సవరణ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా

  • మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్
  • దీనిపై విచారణ 8వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
  • 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న ఈసీ  

తెలంగాణ ఓటర్ల జాబితా సవరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ 8వ తేదీకి వాయిదా పడింది. విచారణ పూర్తయ్యే వరకు తుది ఓటర్ల జాబితా ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ జాబితాను తమకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఓటర్ల జాబితా అవకతవకలపై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో రెండు పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను మాత్రమే విచారించింది.

Telangana
voters list
High Court
  • Loading...

More Telugu News