chief justice of india: దేశం మొత్తానికి ప్రధాన న్యాయమూర్తా? లేక సుప్రీంకోర్టుకు మాత్రమేనా?: కీలక అంశాన్ని లేవనెత్తిన జస్టిస్ కురియన్ జోసెఫ్
- నియామక పత్రంలో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అని రాశారు
- ప్రమాణస్వీకారం పత్రంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యామూరి అని పేర్కొన్నారు
- ఇది పెద్ద లోపం.. దీన్ని సవరించాలి
దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తారు జస్టిస్ కురియన్ జోసెఫ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొత్తం దేశానికా? లేక సుప్రీంకోర్టుకు మాత్రమేనా? అనే సందేహాన్ని వెలిబుచ్చారు. నియామక పత్రంలో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అని రాశారని... రాజ్యాంగం ప్రకారం ప్రమాణస్వీకారం పత్రంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఎస్సీ) అని పేర్కొన్నారని ఆయన తెలిపారు.
'రాష్ట్రపతి నియమించిన భారత ప్రధాన న్యాయమూర్తి అదే రాష్ట్రపతి ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు' అని ఆయన తెలిపారు. ఇది పెద్ద లోపమని అన్నారు. దీన్ని సరిదిద్దాలని... దీనికోసం రాజ్యంగంలోని 3వ షెడ్యూల్ ను సవరించాలని చెప్పారు.