ntr: 'అరవింద' పాటలో స్టెప్స్ తో అదరగొట్టేసిన ఎన్టీఆర్

  • ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే 
  • మరో కథానాయికగా ఈషా రెబ్బా 
  • ముఖ్యపాత్రల్లో జగపతిబాబు .. నవీన్ చంద్ర

ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి వదిలిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'అనగనగనగా .. అరవిందట తన పేరు .. అందానికి సొంతూరు .. అందుకనే ఆ పొగరు ' అనే సాంగ్ ప్రోమోను వదిలారు.

విదేశాల్లో చిత్రీకరించిన ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్ తో అదరగొట్టేశాడు. కష్టతరమైన స్టెప్స్ ను కూడా ఆయన తనదైన స్టైల్లో చాలా తేలికగా వేసేస్తూ ఆకట్టుకున్నాడు. హుషారుగా సాగిపోతోన్న ఈ పాటకి ఎన్టీఆర్ తన స్టెప్స్ తో మరింత జోష్ పెంచాడు. డాన్సులతో ఎన్టీఆర్ దుమ్మురేపేస్తాడనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్ డాన్సులను ఇష్టపడేవారికి ఈ పాట .. పండుగ చేస్తుందని చెప్పొచ్చు. మరో కథానాయికగా ఈషా రెబ్బా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. నవీన్ చంద్ర కీలకమైన పాత్రలను పోషించారు. 

  • Loading...

More Telugu News