KCR: 'ఒసేయ్ రాములమ్మ'లో రామిరెడ్డి లాంటోడు కేసీఆర్: విజయశాంతి

  • ఆ సినిమాలో రామిరెడ్డి విలన్
  • ఇప్పుడు తెలంగాణకు కేసీఆర్ విలన్
  • రాష్ట్రంలో దొరల పాలనే సాగుతోందన్న విజయశాంతి

తాను నటించిన సూపర్ హిట్ చిత్రం 'ఒసేయ్ రాములమ్మ' సినిమాలో విలన్ రామిరెడ్డి వంటి వ్యక్తి కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నటి విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రంలో తాను దొరల వల్ల ఎన్ని కష్టాలు పడ్డానో అందరికీ తెలుసునని, ఆ దొరలలాగే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన సమయంలో ఉన్న కేసీఆర్ వేరని, ఇప్పుడున్న కేసీఆర్ వేరని వ్యాఖ్యానించిన ఆమె, రాష్ట్రంలో ఇప్పుడు దొరల పాలన సాగుతోందని, దానికి విముక్తి పలికే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురూ, రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకు తింటున్నారని ఆరోపించిన ఆమె, ఆనాడు రాత్రి 12 గంటల సమయంలో తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారన్న విషయాన్ని ఇంతవరకూ తెలియజేయలేదని అన్నారు.

KCR
Ramireddy
Osia Ramulamma
Vijayasanthi
  • Loading...

More Telugu News