Harish Rao: ఆత్మహత్యల సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన ఘనత కేటీఆర్‌దే!: హరీశ్‌రావు ప్రశంసలు

  • కేటీఆర్‌పై ప్రశంసల జల్లు
  • అభివృద్ధిలో మాత్రమే పోటీ
  • ఒకే కేబినెట్‌లో పనిచేస్తామనుకోలేదు

ఒకే వేదికను నేడు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పంచుకున్నారు. ఈ సందర్భంగా తమకు అభివృద్ధిలో మాత్రమే పోటీ అని కేటీఆర్ అంటే.. కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు హరీశ్ రావు. గురువారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు, కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హరీశ్ రావుతో తనకు ఎలాంటి మనస్పర్థలూ లేవని వెల్లడించారు.

హరీశ్‌కు, తనకూ ఏదైనా పోటీ ఉంటే అది అభివృద్ధిలో మాత్రమేనని, తామిద్దరం ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసికట్టుగా ముందుకెళ్తున్నామన్నారు. తామిద్దరం ఒకే కేబినెట్‌లో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు. కేసీఆర్‌ మరో 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. అప్పుడే రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తుందన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆత్మహత్యల సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన ఘనత కేటీఆర్‌దేనన్నారు.

Harish Rao
KTR
KCR
TRS
sirisilla
cabinet
  • Loading...

More Telugu News