kcr: అది మహాకూటమా? కాలకూటవిషమా?: సీఎం కేసీఆర్ ఫైర్

  • టీఆర్ఎస్ ను ఓడించాలని ప్రతిపక్షాల కుట్ర 
  • కుట్రల్లో కొత్త కుట్ర.. చంద్రబాబుతో కలిశారు
  • చిల్లర రాజకీయం కోసం నీచాతి నీచంగా దిగజారారు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలేంటో ప్రజలకు తెలుసని అన్నారు. కుట్రల్లో కొత్త కుట్ర.. చంద్రబాబుతో కలిశారని మండిపడ్డారు.

‘వీళ్ల చిల్లర రాజకీయం కోసం నీచాతి నీచంగా దిగజారి.. చంద్రబాబును తీసుకొస్తారుట. చంద్రబాబుకు ఉన్న హాఫ్ పర్సెంటో, జీరో పర్సెంటో ఓట్లుంటే..దాంతో గండం గట్టెక్కుతారట. విజయవాడలో చంద్రబాబు నాయుడు నిన్నో మాట మాట్లాడాడు.. అదో తమాషా.. తెలుగువాళ్లమొక్కటని కేసీఆర్ కు చెప్పినా. మనమిద్దరం ఒకటవుదామని చెప్పినా... నా వెంబడి రాలేదు. అందుకే, మహాకూటమి వచ్చింది’ అని చంద్రబాబు అన్నాడు. అది మహాకూటమా? కాలకూటవిషమా? మహాకూటమా? మా తెలంగాణను నాశనం చేసే కూటమా?’ అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News