: తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందే!: కేటీఆర్
తెలంగాణపై నెలరోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పి, తర్వాత ఒక గడువంటూ లేదన్న కేంద్రం వ్యాఖ్యలపై తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇచ్చిన మాట తప్పి, తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు షిండే వివరణ ఇవ్వాలని డిమాండు చేశారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో చేపట్టే సార్వత్రిక సమ్మె గోడ పత్రికను కేటీఆర్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, టీ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామన్నారు.