t-congress: కాంగ్రెస్ నేత గండ్ర మోసం చేశారంటూ మహిళ ధర్నా.. ఆమెపై చేయిచేసుకున్న మహిళా కార్యకర్తలు

  • మళ్లీ ఆరోపణలు గుప్పించిన మహిళ విజయలక్ష్మి
  • గండ్ర నన్ను శారీరకంగా వాడుకుని మోసం చేశారు
  • పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్

కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి తనను మోసం చేశారని గతంలో ఆరోపణలు చేసిన విజయలక్ష్మి అనే మహిళ మళ్లీ రంగంలోకి దిగింది. జయశంకర్ భూపాలపల్లిలోని జయశంకర్ చౌరస్తాలో ఈరోజు ఆమె ధర్నాకు దిగింది. ఆమెకు మద్దతుగా మరికొందరు మహిళలు నిలిచారు. గండ్ర తనను శారీరకంగా వాడుకుని మోసం చేశారని, పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

అయితే, ధర్నాకు దిగిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. ధర్నా చేసేందుకు వీలులేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని కార్యకర్తలు విజయలక్ష్మికి చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. దీంతో, ఆమెను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో విజయలక్ష్మిపై  కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు చేయిచేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందిస్తూ, ఇప్పటికే కేసు విచారణ కొనసాగుతోందని, ఆమెను విచారణ చేస్తున్నామని చెప్పారు.

t-congress
Jayashankar Bhupalpally District
  • Loading...

More Telugu News