nakirekal: నకిరేకల్ స్థానాన్ని టీడీపీకే కేటాయించాలి: శ్రీధర్ రెడ్డి

  • రెండు సార్లు స్వల్ప తేడాతో టీడీపీ ఓడిపోయింది
  • నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది
  • టీడీపీకి టికెట్ ఇస్తే గెలుపు తథ్యం

మహాకూటమి పొత్తులో భాగంగా నకిరేకల్ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని కట్టంగూర్ టీడీపీ మండలాధ్యక్షుడు నూకల శ్రీధర్ రెడ్డి కోరారు. గతంలో రెండు సార్లు నకిరేకల్ నుంచి స్వల్ప తేడాతో టీడీపీ ఓడిపోయిందని... బలమైన కేడర్ ఉన్న టీడీపీకి టికెట్ కేటాయిస్తే గెలుపు తథ్యమని చెప్పారు. మహాకూటమి నేతలు ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి ముప్పిడి యాదయ్య, తెలుగు యువత అధ్యక్షుడు శివశంకర్, యాదయ్య తదితర నేతలు పాల్గొన్నారు. 

nakirekal
Telugudesam
ticket
congress
maha kutami
  • Loading...

More Telugu News