nvss prabhakar: ఢిల్లీకి పోయి కాషాయ నేతలకు పొర్లుదండాలు ఎందుకు పెడుతున్నావ్?: కేసీఆర్ మాటలపై బీజేపీ ఫైర్

  • బీజేపీ ఏడున్నదో ఎవనికీ తెల్వదు అన్న కేసీఆర్
  • బీజేపీ అంటే అంత వణుకు ఎందుకన్న ప్రభాకర్
  • ప్రగతి భవన్ లో ఉండేవారికి పేదల బాధలు ఎలా తెలుస్తాయంటూ ఎద్దేవా

బీజేపీ అనే పార్టీ ఒకటుందని... అది ఏడున్నదో ఎవనికీ తెల్వదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ అహంకారానికి ఈ వ్యాఖ్యలు పరాకాష్ట అని అన్నారు.

బీజేపీ లేకపోతే... ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలకు పొర్లుదండాలు ఎందుకు పెడుతున్నావ్? అంటూ ప్రశ్నించారు. బీజేపీ అంటే అంత వణుకు ఎందుకని అడిగారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లు కట్టిస్తామని, కట్టించేంత వరకు ఇంటి కిరాయి కడతామని తాము చెప్పిన మాటలు ప్రజలకు అర్థమయ్యాయని అన్నారు. 50 గదుల ప్రగతి భవన్ లో ఉండే మీకు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని ప్రజలను మోసం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు.

nvss prabhakar
bjp
kcr
TRS
  • Loading...

More Telugu News