Naxals: 12వ తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసిన నక్సలైట్లు.. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం!

  • చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఘటన
  • ఎన్‌కౌంటర్ జరిగిన కాసేపటికే కిడ్నాప్
  • ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు మరోమారు తెగబడ్డారు. ఎన్‌కౌంటర్ జరిగిన కాసేపటికే రెచ్చిపోయారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని అపహరించుకుపోయారు. విద్యార్థి బెజ్జీ నుంచి కొండాకు వెళ్తుండగా నక్సలైట్లు అతడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అంతకుముందే  పోలీసులకు నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ఓ నక్సలైట్ ను పోలీసులు సజీవంగా పట్టుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే విద్యార్థిని కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. విద్యార్థి కోసం రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Naxals
Chhattisgarh
abduct
student
Sukma
  • Loading...

More Telugu News