Jana Reddy: ఇంత మెత్తగా ఉంటే ఎలా? లాభంలేదు.. దూకుడు పెంచండి!: జానా గురించి జైపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • జానారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేత
  • వెనుకంజవేసే రకం కాదు
  • ధర్మాగ్రహం ప్రదర్శించాల్సిందేనన్న జైపాల్ 

తెలుగు రాష్ట్రాల్లో ఆయనంత అనుభవం ఉన్న రాజకీయ నేత మరొకరు లేరని, ఇదే సమయంలో ఆయన మెత్తగా ఉంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ సీఎల్పీ నేత, జానారెడ్డి గురించి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డి ఎన్నడూ వెనుకంజ వేసే టైపు కాదని అభిప్రాయపడ్డ ఆయన, ఇదే సమయంలో దూకుడుగా కూడా ఉండరని అన్నారు.

 ప్రత్యేక వక్తిత్వం ఆయన సొంతమని, పుస్తకాల్లో ఉన్నవి చదివి తెలుసుకుని, వాటిపై నిపుణులతో చర్చిస్తారని, అన్ని విషయాల మీదా మాట్లాడగలరని అన్నారు. రాజకీయాలలో అజాత శత్రువుగా ఉండడం చాలా ముఖ్యమని, ఇదే సమయంలో అవసరమైన వేళ ధర్మాగ్రహం ప్రదర్శించాల్సిందేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెత్తగా మాట్లాడితే, దాన్ని బలహీనతగా చూస్తారని, అప్పుడప్పుడు దూకుడు తప్పదని జైపాల్‌ రెడ్డి హితవు పలికారు.

Jana Reddy
Jaipal Reddy
Telangana
Elections
  • Loading...

More Telugu News