ayush sharma: ఆ నటి ‘బాహుబలి’ చూసింది కానీ, ప్రభాస్ ఎవరో తెలియదట!

  • ‘లవ్ యాత్రి’ ప్రచార కార్యక్రమం
  • హైదరాబాద్ వచ్చిన ఆయుష్ శర్మ, వరీన్ హుస్సేన్
  • ఆమె ఆఫ్గానిస్థాన్ అమ్మాయన్న ఆయుష్ శర్మ

సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘లవ్ యాత్రి’. వరీన్ హుస్సేన్, ఆయుష్ శర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ‘లవ్ యాత్రి’ చిత్ర ప్రచారం నిమిత్తం ఆయుష్ శర్మ, వరీన్ హుస్సేన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు.

టాలీవుడ్ చిత్రాల గురించి పెద్దగా తెలియదు కానీ, ‘బాహుబలి’ చిత్రం మాత్రం చూశానని చెప్పిన  హీరోయిన్ వరీన్ హుస్సేన్..   ‘ప్రభాస్ ఎవరో తెలుసా?’ అంటే.. సమాధానం చెప్పలేకపోయింది. వెంటనే, ఆయుష్ శర్మ కల్పించుకుని, ఆమె ఆఫ్గానిస్థాన్ కు చెందిన అమ్మాయని, అందుకే, చెప్పలేకపోయిందని అన్నాడు. తన సహనటి తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.

ayush sharma
warina hussain
love yatri
  • Loading...

More Telugu News