janvi kapoor: రాజస్థానీ లుక్ కోసం 30 సార్లు ప్రయోగం చేశారు: జాన్వి

  • మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్న జాన్వి
  • మనీష్ ఇంటికి వెళ్లడం తొలిసారి 
  • సరైన లుక్ కోసం చాలా కసరత్తులు చేస్తారు

  ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్‌లో పాల్గొంది. తల్లికి దుస్తులను డిజైన్ చేసే మనీష్ మల్హోత్రానే జాన్వికి కూడా డిజైన్ చేస్తున్నారు. ఫోటో షూట్‌కి ఆమె మనీష్ డిజైన్ చేసిన దుస్తులనే ధరించింది. ఈ సందర్భంగా జాన్వి 'ధడక్' సినిమా గురించి మాట్లాడింది. ఈ చిత్రంలో తనకు రాజస్థానీ అమ్మాయి లుక్ కోసం మనీష్ 30 సార్లు ప్రయోగం చేశారని జాన్వి చెప్పింది.

‘దుస్తుల ఫిట్టింగ్ కోసం మనీష్ ఇంటికి వెళ్లాను. అమ్మ తన సినిమాలూ, ఇతర కార్యక్రమాల కోసం దుస్తులను ఆయన దగ్గరే తీసుకునేవారు. కానీ నేను వృత్తిపరంగా మనీష్ దగ్గరకు వెళ్లడం ఇదే తొలిసారి. నాకు తెలిసి ధడక్ సినిమా కోసం 30 లుక్స్ ప్రయత్నించాం. మనీష్ సరైన లుక్ కోసం చాలా కసరత్తులు చేస్తారు. వస్త్రధారణ గురించి ఆయనకన్నా బాగా ఎవరికీ తెలియదనే నమ్మకంతో నేను ఆ విషయాన్ని ఆయనకే వదిలేశా’ అని చెప్పింది జాన్వి.

janvi kapoor
sridevi
dhadak movie
manish malhotra
  • Loading...

More Telugu News