murthy: స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌లో 'గీతం' మూర్తి బౌతిక కాయం!

  • ఒక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
  • వెంకట్ కడియాల వెన్నుముకకు శస్త్రచికిత్స
  • రీజనల్ ఆసుపత్రిలో కోలుకుంటున్న వెంకట్

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ‘గీతం’ మూర్తి సహా మరో ముగ్గురి మృత దేహాలు అలస్కా స్టేట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌లో ఉన్నాయని  తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన తెలిపారు. ఒక మృతదేహానికి ఇప్పటికే పోస్టుమార్టం పూర్తైందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వెంకట్‌ కడియాల వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగిందని... ఆయన అలస్కాలోని రీజనల్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని సతీశ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాద కేసును బ్రియాన్‌ హేలి, వాస్మన్ అనే పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారని సతీశ్ వెల్లడించారు. రేపు అధికారులు మూర్తి బస చేసిన హోటల్‌కు వెళ్లి పాస్ పోర్టు సేకరిస్తారని పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలిసినప్పటి నుంచి సతీశ్ వేమన, తానా కార్యదర్శి అంజయ్య రావు, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, కోశాధికారి రవి పొట్లూరి తదితరులు డిటెక్టివ్ జారెడ్ ఫిషర్, దర్యాప్తు అధికారి వాస్మన్‌లకు అందుబాటులో ఉంటూ వారికి కావల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

murthy
sathish vemana
venkat kadiyala
anjaiah
ravi potluri
vasman
  • Loading...

More Telugu News