Revanth Reddy: రేవంత్ రెడ్డిని ఐదున్నర గంటలసేపు విచారించిన ఐటీ అధికారులు.. ముగిసిన విచారణ

  • 23న మళ్లీ విచారణకు హాజరుకావాలని ఆదేశం
  • ఓటుకు నోటు కేసుపైనే ప్రధానంగా విచారణ
  • స్టీఫెన్ సన్ కు ఇవ్వబోయిన డబ్బుపై ఆరా

కాంగ్రెస్ నేత రేవంత్ ను దాదాపు ఐదున్నర గంటల సేపు ఐటీ అధికారులు విచారించారు. కాసేపటి క్రితమే విచారణ పూర్తయింది. ఈనెల 23న మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. విచారణలో ముఖ్యంగా ఓటుకు నోటు కేసుపైనే ప్రశ్నించినట్టు సమాచారం. స్టీఫెన్ సన్ కు ఇవ్వబోయిన రూ. 50 లక్షల గురించే ప్రధానంగా ఆరా తీశారని తెలుస్తోంది. ఇదే కేసులో నిన్న సెబాస్టియన్, ఉదయసింహ, రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, మామ పద్మారెడ్డిలను విచారించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ కేసును ఈడీకి ఏసీబీ అప్పగించింది.

Revanth Reddy
it
enquiry
vote for note
  • Loading...

More Telugu News