Tamilnadu: నవాబ్ ఎఫెక్ట్.. శరీరానికి కొక్కేలు గుచ్చుకుని వేలాడుతూ శింబు పోస్టర్ కు అభిమాని పాలాభిషేకం!

  • హిట్ టాక్ తెచ్చుకున్న నవాబ్ సినిమా
  • శరీరాన్ని హింసించుకున్న శింబు అభిమాని
  • తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన

తమ హీరో సినిమా రిలీజ్ అయినా, హిట్ టాక్ సొంతం చేసుకున్నా అభిమానుల సంబరాలకు హద్దు ఉండదు. కొందరు థియేటర్ల వద్ద హంగామా చేస్తే మరికొందరేమో అన్నదానం వంటి కార్యక్రమాలు చేస్తారు. తమిళనాట ఇది మరికాస్త ఎక్కువ. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్(తమిళంలో చెక్క చివంత వానం) హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో శింబు పోషించిన రుద్ర అనే ఆయుధాల డీలర్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో శింబు ఫ్యాన్స్ సంబరాలకు హద్దే లేకుండా పోయింది.

అయితే చెన్నైలో ఓ అభిమాని మాత్రం శింబుకు హిట్ రావడాన్ని విచిత్రంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. క్రేన్ కొక్కేలను శరీరానికి గుచ్చుకున్న ఓ శింబు అభిమాని.. గాల్లోకి లేచి 25 అడుగుల ఎత్తు ఉన్న శింబు పోస్టర్ కు పాలాభిషేకం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, సదరు అభిమాని చర్యను చాలామంది నెటిజన్లు తప్పుపడుతున్నారు.

Tamilnadu
chennai
kollywood
simbu
nawab
maniratnam
fan
hanging
palabhishekam
  • Error fetching data: Network response was not ok

More Telugu News