junior ntr: నా జీవితంలో నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి ముడిపడిందేమో!: జూనియర్ ఎన్టీఆర్

  • మనిషిగా పుట్టినందుకు ఎలా బతకాలో చెప్పే చిత్రమిది
  • త్రివిక్రమ్ లో ఒక ఆత్మబంధువుని చూశా
  • ‘అరవింద సమేత’ ప్రీ-రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్

దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలన్నది పన్నెండు సంవత్సరాల తన కల అని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ‘అరవింద సమేత’ ప్రీ-రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, కుదర్లేదని అన్నారు. ‘నువ్వేనువ్వే’ చిత్రం నుంచి త్రివిక్రమ్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. నెల క్రితం నా జీవితంలో జరిగిన సంఘటన ఈ చిత్రానికి ముడిపడిందేమోనని ఎన్టీఆర్ అన్నారు.

త్రివిక్రమ్ తో చిత్రం మొదలు పెట్టిన తర్వాత, నెల క్రితం జరిగిన సంఘటన వల్ల.. జీవితం విలువ తనకు అర్థమైందంటూ తన్నుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మనిషిగా పుట్టినందుకు ఎలా బతకాలో చెప్పేదే ఈ చిత్రమని, పన్నెండేళ్ల తమ పరిచయంలో త్రివిక్రంలో ఒక స్నేహితుడిని, దర్శకుడిని చూశానని, ఈ సినిమా అయిపోయే లోపు ఒక ఆత్మబంధువుని చూశానని త్రివిక్రమ్ పై తన అభిమానాన్ని జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News