kaushal: చెర్రీ సినిమాలో కీలక పాత్రలో 'బిగ్ బాస్ 2' విజేత కౌశల్!

  • కౌశల్‌కు వరుస సినీ అవకాశాలు
  • బోయపాటి దర్శకత్వంలో నటిస్తోన్న చెర్రీ
  • కౌశల్‌కు మారుతి, కోన వెంకట్ శుభాకాంక్షలు

ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్ 2 రియాల్టీ షో ముగిసింది. కౌశల్ ఈ షోలో విన్నర్ అవడంతో పాటు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో వరుస సినీ అవకాశాలు ఆయన్ను వరిస్తున్నాయట. కౌశల్ షోలో ఉండగానే నందమూరి బాలకృష్ణకు విలన్‌గా అవకాశం వచ్చిందంటూ రూమర్స్ వినిపించాయి.

తాజాగా రామ్ చరణ్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ కీలక పాత్రలో కౌశల్‌కు అవకాశం వచ్చిందని ఫిలింనగర్‌లో టాక్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. కౌశల్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా సినీ ప్రముఖులు మారుతి, కోన వెంకట్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 

kaushal
ram charan
boyapati srinu
kiara advani
bala krishna
  • Loading...

More Telugu News