mahatma gandhi: భోజనానంతరం తమ కంచాలను తామే శుభ్రం చేసిన సోనియా, రాహుల్!

  • గాంధీ జయంతి సందర్భంగా ప్రార్థనా సమావేశం
  • మహాత్ముని మాటలను ఆచరించిన రాహుల్, సోనియా 
  • ఆశ్రమంలో మొక్కను నాటిన రాహుల్

గాంధీ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన మాటలను అక్షరాలా ఆచరించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ. మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న సేవాగ్రామ్‌ ఆశ్రమంలో నేడు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రార్థనా సమావేశంలో రాహుల్, సోనియాలతో పాటు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనానంతరం సోనియా, రాహుల్ వారి కంచాలను వారే స్వయంగా శుభ్రం చేశారు. ఎవరి సొంత పనులు వారే స్వయంగా చేసుకోవాలన్న మహాత్ముని మాటలను అక్షరాలా ఆచరణలో పెట్టారు. 1986లో రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవాగ్రామ్ ఆశ్రమంలో ఓ మొక్కను నాటారు. నేడు ఆ చెట్టు పక్కనే రాహుల్ ఓ మొక్కను నాటారు. ఈ ప్రార్థనా సమావేశంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రులు సుశీల్ కుమార్ షిండే, ఏకే ఆంటోని, శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.  

mahatma gandhi
sonia gandhi
rahul gandhi
rajeev gandhi
  • Loading...

More Telugu News