konda surekha: దమ్ముంటే కొండా దంపతులను ఢీకొను: కడియం శ్రీహరికి కాంగ్రెస్ నేత విద్యాసాగర్ సవాల్

  • తాటికొండ రాజయ్య నుంచి డిప్యూటీ సీఎం పదవి లాక్కున్నారు
  • ఇప్పుడు టికెట్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు
  • కొండా దంపతులు పారిపోయారంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం

తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి దమ్ముంటే పరకాల నియోజకవర్గంలో కొండా దంపతులను ఎదుర్కోవాలని కాంగ్రెస్ నేత అచ్చ విద్యాసాగర్ సవాల్ విసిరారు. లేనిపక్షంలో కొండా దంపతులపై విమర్శలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాటికొండ రాజయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని కుట్రపూరితంగానే శ్రీహరి లాక్కున్నారని... ఇప్పుడు ఆయనకు టికెట్ కూడా దక్కకుండా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమకారులు ఉన్న ఆస్తులను పోగొట్టుకుంటే... కడియం శ్రీహరి మాత్రం అడ్డదారిలో కోట్లు కూడబెట్టారని విమర్శించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు తగాదాలను కడియం శ్రీహరి ప్రోత్సహిస్తున్నారని విద్యాసాగర్ అన్నారు. నన్నపునేని నరేందర్ ను కార్పొరేటర్ గా గెలిపించింది కొండా దంపతులేనని... అలాంటి వారిని భయంతో పారిపోయారంటూ శ్రీహరి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. బండా ప్రకాశ్ కు రాజ్యసభ పదవిని ఇప్పించి ఉద్యమకారులకు శ్రీహరి ద్రోహం చేశారని మండిపడ్డారు. 

konda surekha
konda murali
Kadiam Srihari
tatikonda rajaiah
TRS
  • Loading...

More Telugu News