prabha: క్లాప్ కొట్టేది ఎంజీఆర్ .. నటించేది ఎన్టీఆర్ తో .. భయపడిపోయాను: ప్రభ

  • ఎన్టీఆర్ తో అదే మొదటి సినిమా 
  • తొలి రోజునే పాట చిత్రీకరణ 
  • భానుమతి పాత్రను బాగా చేయమన్నారు  

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రభ మాట్లాడుతూ, ఎన్టీ రామారావుగారితో కలిసి నటించిన తొలి సినిమా అనుభవాలను గురించి ప్రస్తావించారు. "ఎన్టీ రామారావుగారితో నా తొలి సినిమా 'దానవీర శూరకర్ణ'. ఈ సినిమా షూటింగు తొలి రోజున రామారావుగారిపై క్లాప్ కొట్టడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ గారు వచ్చారు. తొలి షాట్ 'చిత్రం భళారే విచిత్రం' పాట పైనే.

ఒక వైపున రామారావుగారితో కలిసి నటించడమనే టెన్షన్ .. మరో వైపున ఎంజీ రామచంద్రన్ ఎదురుగా ఉన్నారనే టెన్షన్. తొలి షాట్ పూర్తయి .. అందరూ వెళ్లిపోయాక, 'ఏంటి భయపడుతున్నారు ? మీరు మంచి డాన్సర్ అని విన్నాము .. మీరు పోషించేది దుర్యోధనుడి భార్య 'భానుమతి' పాత్ర. భయపడకూడదు .. భానుమతిలోని ధైర్యం .. దర్పం కనిపించాలి' అని ఎన్టీఆర్ అన్నారు. ఆయనలా అనడంతో మనసు కాస్త తేలిక పడింది. అప్పటి నుంచి బాగానే చేశాను .. రెండున్నర రోజుల్లో ఆ పాట చిత్రీకరణను పూర్తి చేశారు" అని చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News