prabha: కమలహాసన్ సినిమా అలా పోగొట్టుకున్నాను: సీనియర్ నటి ప్రభ

  • 'సొమ్మొకడిది సోకొకడిది' కోసం నన్ను తీసుకున్నారు 
  • కొన్ని కారణాల వలన డేట్స్ సర్దుబాటు కాలేదు 
  • ఆ పాత్ర చేయనందుకు చాలా బాధ పడ్డాను       

కథానాయికగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన ప్రభ, ఆ పాత్రల్లో ఎంతో సహజంగా ఒదిగిపోయారు. అలాంటి ప్రభ .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. "చాలా సినిమాల్లో నేను మంచి మంచి అవకాశాలు పోగొట్టుకున్న సందర్భాలు వున్నాయి. అలాంటి సినిమాల్లో 'సొమ్మొకడిది సోకొకడిది' ఒకటి.

ఈ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం చేశారు. ఒక కమల్ సరసన జయసుధను .. మరో కమల్ సరసన నన్ను తీసుకున్నారు. 'అబ్బో నేరేడు పళ్లు'అనే సాంగ్ నా పాత్రపైనే వుంది. కానీ కమల్ బిజీగా ఉండటం వలన .. ఆయన కోసం రెండు సార్లు నా డేట్స్ మార్చుకున్నాను .. మూడోసారి కుదరలేదు. ఆ సినిమా పూర్తయిన తరువాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారు ఫోన్ చేసి, జెమినీ ల్యాబ్ లో షో వేస్తున్నాం .. చూడటానికి రమ్మన్నారు. ఆ సినిమా చూసిన తరువాత .. అంతమంచి పాత్ర చేయలేక పోయినందుకు చాలా బాధపడ్డాను " అని చెప్పుకొచ్చారు.       

prabha
ali
  • Loading...

More Telugu News