roja: వైయస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా.. రోజా నోటికొచ్చినట్టు మాట్లాడేవారు: సోమిరెడ్డి

  • రాజకీయాల్లో రోజాకు ఏబీసీడీలు కూడా తెలియవు
  • సీఎం, మంత్రులను విమర్శించడమే ఆమె పని
  • అర్హులైన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిని ఇస్తాం

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నిరుద్యోగ భృతి కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. రాజకీయాల్లో రోజాకు ఏబీసీడీలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులను తిట్టడమే రోజా పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా... రోజా ఇలాగే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, ఆయనపై విమర్శలు చేసేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న అర్హులైన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పారు.

roja
somireddy
YSRCP
Telugudesam
yuva nestam
  • Loading...

More Telugu News