prabha: 'నీడలేని ఆడది' కోసం ఒక డైలాగ్ చెప్పించి నన్ను ఓకే చేశారు!: సీనియర్ నటి ప్రభ

  • పేపర్ ప్రకటన చూసి ప్రయత్నించాను 
  • సినిమా సూపర్ హిట్ అయింది
  • తమిళంలో జయప్రభగా గుర్తించారు  

అలనాటి కథానాయికలలో ప్రభ ఒకరు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. అలాంటి ప్రభ .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ నటిగా తన కెరియర్ ఎలా మొదలైందనే విషయాన్ని గురించి ప్రస్తావించారు.

'నీడలేని ఆడది' సినిమా కోసం పేపర్లో ప్రకటన రావడంతో ప్రయత్నించాను. నరసింహరాజు గారు .. నూతన్ ప్రసాద్ గారు .. అన్నపూర్ణమ్మ గారు .. పి.ఎల్. నారాయణ గారు ఈ సినిమాతోనే పరిచయమయ్యారు. ఈ సినిమా కోసం నన్ను పిలిపించి .. ఒక డైలాగ్ చెప్పించి ఓకే చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నాకు మంచి పేరు వచ్చింది. ఇక్కడ నన్నంతా 'ప్రభ' గా ఆదరించారు .. తమిళ ప్రేక్షకులు మాత్రం 'జయప్రభ'గా గుర్తించారు. తమిళంలో నా తొలి సినిమా జయశంకర్ సరసన చేయడమే అందుకు కారణం'' అంటూ చెప్పుకొచ్చారు.       

prabha
ali
  • Loading...

More Telugu News