vijayanagaram: బహిరంగ సభలో.. విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్!

  • వచ్చే ఎన్నికల్లో  కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారు
  • విజయనగరం విషజ్వరాల జిల్లాగా మారింది
  • వైఎస్సార్ సీఎం అయ్యే వరకూ ఈ జిల్లా వెనుకబడే ఉంది

వైసీపీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 275వ రోజు పాదయాత్ర సందర్భంగా, విజయనగరం జిల్లాలోని మూడు లాంతర్ల జంక్షన్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ఈ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారని చెప్పారు.

2004లో వైఎస్సార్ సీఎం అయ్యే వరకు కూడా విజయనగరం జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేదని, వైఎస్సార్ సీఎం అయ్యాక ఐదేళ్ల కాలంలో విజయనగరం జిల్లాలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో నీటి ప్రాజెక్టులు పడకేశాయని, బీమ్ సింగ్ చక్కెర కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందని, అందులోని ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, విజయనగరం విషజ్వరాల జిల్లాగా మారిందని అన్నారు.

  • Loading...

More Telugu News