Kodandaram: బీజేపీతో పొత్తుపై కోదండరామ్ స్పందన!

  • బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు
  • నిరంకుశ పాలనను అంతమొందించడమే మా లక్ష్యం
  • మహాకూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా మొదలు కాలేదు

మహాకూటమితో జత కట్టిన టీజేఎస్ అధినేత కోదండరామ్... మరోవైపు బీజేపీతో చేయి కలిపే యోచనలో కూడా ఉన్నారనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలపై కోదండరామ్ స్పందించారు. బీజేపీతో కలిసే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇదే విషయంపై మహాకూటమిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఏయే పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై చర్చలు ఇంకా మొదలు కాలేదని చెప్పారు. మరోవైపు మహాకూటమి వరుస సమావేశాలను నిర్వహించనుంది. నేడు, రేపు ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు అంశాలపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల నేతలు చర్చించనున్నారు.

Kodandaram
maha kutami
bjp
tjs
telangana
  • Loading...

More Telugu News