allu arjun: బన్నీకి '96' సినిమాను చూపించిన దిల్ రాజు

  • తమిళంలో రూపొందిన '96'
  • దిల్ రాజు చేతికి రీమేక్ రైట్స్ 
  • స్పెషల్ షో చూసిన అల్లు అర్జున్  

తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా '96' సినిమా రూపొందింది. 1996 కాలంలో సాగే విభిన్నమైన ప్రేమకథ ఇది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అక్కడ భారీ అంచనాలు వున్నాయి. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమా రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు.బన్నీ కోసం హైదరాబాద్ లో దిల్ రాజు నిన్న రాత్రి  స్పెషల్ షో వేశాడట. బన్నీతో ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఉద్దేశం ఏమీ లేదనీ .. కంటెంట్ పట్ల బన్నీ అభిప్రాయం తెలుసుకోవడం కోసమే దిల్ రాజు అలా చేశాడని అంటున్నారు. మరి ఈ సినిమా చూసి దిల్ రాజుకి బన్నీ ఏం చెప్పాడనేది తెలియరాలేదు. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించనున్నారు? ఎవరెవరు నటించనున్నారు ? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.      

  • Loading...

More Telugu News