Allu Sirish: అల్లు శిరీష్ ను 'కారు గిఫ్ట్' అడిగిన నవదీప్!

  • శిరీష్ కు ల్యాప్ టాప్ ఇచ్చిన బన్నీ
  • తన పాత ల్యాపీని అభిమానికి ఇచ్చిన శిరీష్
  • తనకో కారు కావాలన్న నవదీప్
  • తలా ఓ కోరిక కోరుతున్న అభిమానులు

ఇప్పుడు అల్లు శిరీష్ ముందు తమతమ కోరికల చిట్టాను విప్పుతున్నారు ఫ్యాన్స్, తలా ఒక కోరిక కోరుతూ వారు చేస్తున్న సందడితో నెట్టింట నవ్వులు పూస్తున్నాయి. ఇంతకూ ఏమైందో తెలుసా?

ఇటీవల అల్లు అర్జున్ తనకు ఓ ల్యాప్ టాప్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని శిరీష్ ట్విట్టర్ లో తెలుపగా, ఓ అభిమాని స్పందిస్తూ, తనకు ల్యాప్ టాప్ ఎంతో అవసరమని, డబ్బు దాచుకుని అది కొనాలంటే మూడేళ్ల సమయం పడుతుందని చెప్పాడు. దీనిపై స్పందించిన శిరీష్, తన వద్ద ఉన్న పాత ల్యాప్ టాప్ ను అతనికి పంపుతానని హామీ ఇచ్చాడు.

దీన్ని తెలుసుకున్న నటుడు నవదీప్, తనకో కారు కావాలని శిరీష్ ని అర్ధిస్తూ ఓ పోస్టు పెట్టాడు. "హాయ్ అల్లు శిరీష్ అన్నా... నేను కూడా నీ అభిమానినే. నాకు ఒక కారు గిఫ్ట్‌ గా ఇవ్వొచ్చుగా. నేను కొత్త కారు కొనుక్కోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. నాకు సినిమా వేతనం తక్కువ. కారు అవసరం చాలా ఎక్కువ. మీ ఆడి క్యూ 7 కొత్తదే అయినా మీ మనసు పెద్దదని నాకు తెలుసు" అని వ్యాఖ్యానించాడు. దీనిపై శిరీష్ ఇంకా స్పందించలేదుగానీ, ఫ్యాన్స్ తమకు ఏమేం కావాలో కోరికల చిట్టాను శిరీష్ ముందుంచుతున్నారు.

Allu Sirish
Navadeep
Fans
Laptop
Car
Allu Arjun
  • Loading...

More Telugu News