Kachiguda: వయసు మీరుతున్నా పెళ్లి కావడం లేదన్న బాధతో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య!

  • ఉప్పుగూడ-యాకత్‌పుర రైల్వేస్టేషన్ల మధ్య  ఘటన
  • ఇంటి వద్ద చెప్పే వెళ్లినట్లు సమాచారం
  • బాధితులది నిరుపేద కుటుంబం

హైదరాబాద్‌ కాచిగూడ రైల్వేస్టేషన్‌ పరిధి ఉప్పుగూడ - యాకత్‌పుర రైల్వేస్టేషన్ల మధ్య శనివారం రాత్రి ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంఎంటీఎస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు పెళ్లికావడం లేదన్న మనస్తాపమే వీరి బలవన్మరణానికి కారణంగా తెలుస్తోంది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం...ఛత్రినాక, అలియాబాద్‌ ప్రాంతానికి చెందిన నందూలాల్‌ కుమార్తెలు కోయల్‌కర్‌ సారిక(35), రజనీ (32). వీరిది నిరుపేద కుటుంబం. వయసు పైబడుతున్నా పెండ్లికావడం లేదని ఆవేదన చెందారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి ఆత్మహత్య చేసుకుంటున్నామని అన్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.

Kachiguda
chatrinaka
Hyderabad
  • Loading...

More Telugu News