: దేశవాళీ క్రికెట్ కూడా ఆడని వ్యక్తికి దక్షిణాఫ్రికా కోచ్ పదవి


రస్సెల్ డొమింగో.. పేరు ఎప్పుడూ వినలేదు కదూ! నిజమే, క్రికెట్ వర్గాల్లో పెద్గగా వినిపించని పేరు ఇది. దక్షిణాఫ్రికా జట్టును టెస్టుల్లో అగ్రస్థానంలో కూర్చుండబెట్టిన కోచ్ గ్యారీ కిర్ స్టెన్ తన పదవి నుంచి తప్పుకుంటుండగా.. అతని వారసుడిగా రస్సెల్ డొమింగోను దక్షిణాఫ్రికా జట్టు ప్రధాన కోచ్ గా నియమించారు. డొమింగో ఇప్పటివరకు కిర్ స్టెన్ కు సహాయకుడిగా వ్యవహరించారు. 38 ఏళ్ళ డొమింగో.. కనీసం దేశవాళీ జట్టుకు కూడా ఆడలేదు.

డొమింగో.. ఈస్టర్న్ ప్రావిన్స్ జట్టుకు ఎంపికయ్యేందుకు ఎన్నో విఫలయత్నాలు చేసిన పిమ్మట తనకు క్రికెట్ ఆడడం అచ్చిరాదనుకున్నాడు. వెంటనే కోచింగ్ బాట పట్టాడు. 22వ ఏట నుంచి క్రికెట్ శిక్షణ ఇస్తోన్న డొమింగో.. కిర్ స్టెన్ వారసత్వాన్ని ఘనంగా కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కిర్ స్టెన్ రెండేళ్ళ పదవీకాలం జులైతో ముగియనుంది. కుటుంబానికి సమయం కేటాయించేందుకని కిర్ స్టెన్ తన కాంట్రాక్టు పునరుద్ధరణకు మొగ్గు చూపలేదు. దీంతో, డొమింగోను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జాతీయ కోచ్ గా శనివారం ప్రకటించింది.

  • Loading...

More Telugu News