IOCL: వంటగ్యాస్ సబ్సిడీ సిలిండర్ ధర పెంపు.. నగదు బదిలీ కూడా పెరిగింది!
- 14.2 కిలోల సిలిండర్‌పై రూ.2.89 పెంపు
- వాణిజ్య సిలిండర్లపై రూ.59 పెరుగుదల
- నగదు బదిలీ మొత్తం రూ.376కు పెంపు
సబ్సిడీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోమారు షాకిచ్చాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఆదివారం తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో గ్యాస్ ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. సబ్సిడీ సిలిండర్‌పై రూ. 2.89, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.59 పెంచుతున్నట్టు తెలిపింది. వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376కు పెంచినట్టు ఐఓసీఎల్ పేర్కొంది.