Telangana: తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు: చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్

  • నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలపై వార్తలు అవాస్తవం
  • ఏదైనా రాసేటప్పుడు వివరణ తీసుకోవాలి
  • మీడియాకు రజత్ కుమార్ సలహా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిపించాలన్న విషయమై ఇంతవరకూ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో కలిపి తెలంగాణ ఎన్నికలు జరిపించనున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన వెల్లడించారు. ఎన్నికల గురించి మీడియాలో వార్తలు రాసేముందు సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని, ఆ తరువాతనే ఏ వార్తనైనా ప్రచురించాలని ఆయన సూచించారు.

ఎన్నికల పోలింగ్ రోజున దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామని, ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయని అన్నారు. పోలింగ్ కేంద్రాలు కింది అంతస్తులోనే ఉండాలని సూచించామని, వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, వారికి కేంద్రానికి సమీపంలోనే పార్కింగ్ వసతిని కల్పిస్తామని అన్నారు.

Telangana
Elections
Rajat Kumar
  • Loading...

More Telugu News