CRPF: బ్రేకింగ్... సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై మావోల మెరుపుదాడి!

  • బీజాపూర్ అడవుల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు
  • ఈ ఉదయం దాడికి దిగిన మావోయిస్టులు
  • గంటపాటు కొనసాగిన ఎదురుకాల్పులు
  • అదనపు బలగాలను దించి కూంబింగ్

చత్తీస్ గఢ్ రాష్ట్ర పరిధిలోని బీజాపూర్ అడవుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు ఈ ఉదయం మెరుపుదాడి చేశారు. తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడిన మావోలను నిలువరించడానికి జవాన్లు కూడా ఫైరింగ్ ఓపెన్ చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది.

పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా క్యాంప్ వేసిన భద్రతా దళాలు, అక్కడి నుంచే అడవుల్లోకి వెళ్లి కూంబింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మావోలు, సీఆర్పీఎఫ్ దళాల మధ్య సుమారు గంట పాటు ఎదురుకాల్పులు సాగినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారని, అదనపు బలగాలను రంగంలోకి దించి, వారికోసం గాలింపును ముమ్మరం చేశామని తెలిపారు.

CRPF
Chattisghad
Maoists
Encounter
  • Loading...

More Telugu News