Hyderabad: కుక్కను తప్పించబోయి యాక్సిడెంట్... రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరుణకు తీవ్ర గాయాలు!

  • సూర్యాపేట సమీపంలో ప్రమాదం
  • విజయవాడకు వెళుతున్న అరుణ కుమారి
  • ఆసుపత్రిలో చికిత్స, పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

ఈ ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె తన కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. సూర్యాపేట సమీపంలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద వేగంగా వెళుతున్న కారు ముందుకు ఓ కుక్కరాగా, దాన్ని తప్పించే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అరుణకుమారికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను చేయిస్తున్నారు. అరుణ కుమారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

Hyderabad
Ranga Reddy District
Deputy Collector
Aruna Kumari
Suryapet District
Road Accident
  • Loading...

More Telugu News