kangana ranaut: అత్యాచారం కేసులో కంగనా రనౌత్ హెయిర్ స్టయిలిస్ట్ అరెస్ట్!

  • బాలుడిపై అత్యాచారం కేసులో బ్రెండన్ అరెస్ట్
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • బ్రెండన్ దక్షిణాఫ్రికాకు చెందినవాడు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హెయిర్ స్టయిలిస్ట్ బ్రెండన్ అలెస్టర్ డీగీ (42)ను ముంబై పోలీసులు బాలుడి అత్యాచారం కేసులో అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని రాయగఢ్ లో ప్రస్తుతం కంగనా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రెండన్ కూడా అక్కడే ఉన్నాడు. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కేసు వివరాల్లోకి వెళ్తే, ఓ డేటింగ్ యాప్ ద్వారా తనకు 18 ఏళ్లు అని పేర్కొంటూ, ఓ పదహారేళ్ల బాలుడు పలువురు పురుష సెలబ్రిటీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని అతని తల్లి గమనించి... తన కుమారుడితో సంబంధాలు ఉన్న ఎనిమిది మంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిలో బ్రెండన్ కూడా ఉండటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

దక్షిణాఫ్రికాకు చెందిన బ్రెండన్... పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హెయిర్ స్టయిలిస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బ్రెండన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 3 వరకు ఆయనను కోర్టు రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. 

kangana ranaut
Bollywood
hair stylist
brendon
arrest
  • Loading...

More Telugu News