Revanth Reddy: రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల పట్ల జీవీఎల్ నర్సింహారావు స్పందన
- తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే పోటీ
- టీఆర్ఎస్ తో కలసి రేవంత్ పై దాడులు చేయించాల్సిన అవసరం లేదు
- మోదీ చరిష్మా వల్లే 2014లో టీడీపీ గెలిచింది
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యే ప్రధానమైన పోటీ ఉందని... టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అన్నారు. అలాంటి తాము టీఆర్ఎస్ తో కలసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై దాడులు చేయించే అవకాశమే లేదని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంలో తామే నంబర్ వన్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని... అప్పులు తెచ్చుకోవడం, అవినీతి, ప్రచారం ఆర్భాటంలోనే ఏపీ నెంబర్ వన్ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. కేవలం మోదీ చరిష్మా వల్లే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అమరావతి బాండ్ల విషయంలో ఇన్వెస్టర్ల పేర్లను బయటపెట్టాలనే తమ డిమాండ్లకు ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.