l ramana: కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా దోచుకుతింది!: ఎల్.రమణ

  • ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పులపాలు చేశారు
  • మహా కూటమి ప్రజల మనసుల్లోకి వెళ్తుంది
  • విపక్ష నేతలను టీఆర్ఎస్ శత్రువులుగా చూస్తోంది

ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల పాలు చేశారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా దోచుకుతిన్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలను శత్రువులుగా టీఆర్ఎస్ చూస్తోందని అన్నారు.

టీఆర్ఎస్ ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే గ్రాండ్ అలయెన్స్ (మహా కూటమి)ను ఏర్పాటు చేశామని... ఈ అలయెన్స్ ప్రజల హృదయాల్లోకి వెళ్తుందని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడే నాయకత్వం, పాలన అనుభవం కూటమి నేతలకు ఉందని తెలిపారు. టీఆర్ఎస్ ను పారద్రోలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

l ramana
maha kutami
kcr
TRS
tTelugudesam
Telugudesam
  • Loading...

More Telugu News