Gujarat: గుజరాత్ లో పరువు హత్య.. చెల్లి, బావలను నరికిచంపిన యువకుడు!

  • దళిత యువకుడిని పెళ్లాడిన యువతి
  • ఆగ్రహంతో రగిలిపోయిన అన్న
  • అదను చూసి దాడి

ఇంట్లో వారిని కాదని దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న చెల్లిపై ఓ అన్న పగబట్టాడు. తోడబుట్టిన చెల్లిని తొలుత కిరాకతంగా చంపిన ఆ యువకుడు.. ఆ తర్వాత బావను వెంటపడి మరీ నరికాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గుజరాత్ లోని సాణంద్ పట్టణంలో చోటుచేసుకుంది.

సాణంద్ లోని బస్టాండ్ సమీపంలో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. ఇదే ప్రాంతంలోని దళితవాడలో ఉంటున్న విశాల్ పర్మర్, ఆ యువతి ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా యువతి విశాల్ ను ఐదు నెలల క్రితం వివాహం చేసుకుంది. దీంతో ఆమె అన్న తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. సమయం కోసం అదనుచూసిన అతను నిన్న చెల్లి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడిచేశాడు.

దీంతో విశాల్ బయటకు పరిగెత్తాడు. ఈ క్రమంలో మరో ఇంట్లోకి వెళ్లి దాక్కున్న విశాల్ ను బయటకు లాక్కుని వచ్చి కత్తితో నరికాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Gujarat
honour killing
dailt
sister
brother in law
  • Loading...

More Telugu News