Bollywood: హీరోయిన్ తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు పంపిన నానా పటేకర్!

  • తప్పుడు ఆరోపణలు చేసిందని వ్యాఖ్య
  • వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • ఇంకా స్పందించని తనుశ్రీ దత్తా

బాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్యవహారం మరింత ముదురుతోంది. ఓ సినిమాలో సీనియర్ నటుడు నానా పటేకర్ తనను వేధించాడని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. తనుశ్రీ దత్తా తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పటేకర్ తన న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ ద్వారా తనుశ్రీ దత్తాకు నోటీసులు పంపారు.

తనుశ్రీ దత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఇప్పటికే ఖండించిన పటేకర్.. ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఇటీవల తనుశ్రీ దత్తా ఆరోపించింది. కేవలం అతనే కాకుండా కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా తనను వేధించారని వాపోయింది. కాగా తనుశ్రీ దత్తాకు ప్రియాంకా చోప్రా, ట్వింకిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్ సహా పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలిపారు.

Bollywood
casting couch
sexual harrasment
legal notice
tanusree dutta
nana patekar
wrong allegations
  • Loading...

More Telugu News