manikyala rao: చెన్నారెడ్డినే తరిమాం... ఆఫ్ట్రాల్ చంద్రబాబు ఎంత?: మాణిక్యాలరావు

  • విమానాశ్రయ భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలి
  • నిరసన దీక్షను అడ్డుకుంటే తిరగబడతాం
  • కర్రలు చేతపట్టి ప్రభుత్వంపై పోరాడుతాం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులతో కలసి ఆయన నిరసన దీక్ష చేపట్టారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడితే... తాము తిరగబడతామని హెచ్చరించారు. అవసరమైతే కర్రలు చేపట్టి ప్రభుత్వంపై పోరాడుతామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డినే తరిమిన ఘనత తమదని... ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరమడం ఎంత పని? అని మాణిక్యాలరావు అన్నారు. దమ్ముంటే తమ నిరసన దీక్షను అడ్డుకోవాలని సవాల్ విసిరారు.

manikyala rao
Chandrababu
marri chenna reddy
  • Loading...

More Telugu News