varavararao: వరవరరావుకు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. మరో నాలుగు వారాలు గృహనిర్బంధంలోనే!

  • భీమా-కొరేగావ్ కేసులో తీర్పు
  • సిట్ ఏర్పాటు అవసరం లేదన్న న్యాయస్థానం
  • దిగువ కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చని సూచన

విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, గౌతమ్ నవలఖాలకు సుప్రీంకోర్టు ఈ రోజు షాక్ ఇచ్చింది. వీరిని తక్షణం విడుదల చేయాలని ప్రముఖ చరిత్రకారిణి రొమీలా థాపర్ తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని మరో నాలుగు వారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా  ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ ల ధర్మాసనం స్పష్టం చేసింది.

గతేడాది మహారాష్ట్రలోని పుణెలో దళిత సంఘాలు ఎల్గర్ పరిషత్ సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం భీమా-కొరెగావ్ ప్రాంతంలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన గొడవల్లో తీవ్రమైన హింస చెలరేగింది. ఈ ఘటన నేపథ్యంలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు గత నెలలో అరెస్ట్ చేశారు. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అరెస్టును గృహనిర్బంధంగా మార్చింది. తమ తీర్పుపై పిటిషనర్లు దిగువ కోర్టులకు వెళ్లవచ్చని సూచించారు.

varavararao
human rights activists
Telangana
Hyderabad
pune police
arrest
bhima koregav
SIT
Supreme Court
  • Loading...

More Telugu News