Vijay Devarakonda: విజయ్ దేవరకొండ తమ్ముడు తెరంగేట్రం... హీరోయిన్ గా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక!

  • టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్
  • తమ్ముడిని పరిచయం చేసేందుకు ఇదే సరైన సమయమని ఆలోచన
  • అక్టోబర్ 10న ప్రారంభం కానున్న షూటింగ్

'అర్జున్‌ రెడ్డి'తో రాత్రికి రాత్రే టాలీవుడ్ స్టార్‌ గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ, తన సోదరుడు ఆనంద్ దేవరకొండను పరిశ్రమకు పరిచయం చేయాలని నిర్ణయించుకుని ముహూర్తం ఫిక్స్ చేశాడు. 'పెళ్లి చూపులు', 'అర్జున్‌ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాల హిట్లతో విజయ్ ఇమేజ్‌ తారస్థాయికి చేరగా, తమ్ముడిని తెరంగేట్రం చేయించేందుకు ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయం కానున్న సినిమాలో హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌ గా పరిచయం కానుంది. తెలంగాణ నేపథ్యంలో కథ ఉంటుందని, అక్టోబర్‌ 10న షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. పలు షార్ట్‌ ఫిలింస్‌ తీసి, తానేంటో నిరూపించుకున్న కేవీఆర్‌ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, దగ్గుబాటి సురేష్‌ బాబు సమర్పణలో యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ లు దీనికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

Vijay Devarakonda
Anand Devarakonda
Rajashekhar
Sivatmika
Tollywood
New Movie
Debut
  • Loading...

More Telugu News