araku: అరకు హత్యల ఎఫెక్ట్.. తెలంగాణ నేతలకు పోలీసుల అలెర్ట్ నోటీసులు!

  • శ్రీధర్ బాబు, పుట్ట మధులకు నోటీసులు
  • సమస్యాత్మక, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దు
  • పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పర్యటనలు చేపట్టవద్దు

ఏపీలోని అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాటారం సబ్ డివిజన్ పోలీసులు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులకు నోటీసులు జారీ చేశారు.

తమకు సమాచారం ఇవ్వకుండా సమస్యాత్మక, అటవీ ప్రాంతాలకు వెళ్లరాదని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని... నాయకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పర్యటనలు చేపట్టరాదని సూచించారు.

araku
maoist
telangana
police
sridhar babu
putta madhu
  • Loading...

More Telugu News