ntr: 'అరవింద సమేత' ప్రీ రిలీజ్ వేడుక ఆ రోజునే

  • పారిస్ లో ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ 
  • అక్టోబర్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • అక్టోబర్ 11వ తేదీన సినిమా విడుదల

ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ 'పారిస్' లో వుంది. కొన్ని రోజులుగా అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టుగా నిన్ననే అధికారికంగా ప్రకటించారు.

దాంతో  అభిమానులందరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడనే ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో వచ్చేనెల 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా తాజా సమాచారం. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. దర్శక నిర్మాతలతో పాటు హీరో జాతకాన్ని కూడా పరిశీలించిన పండితులే ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి .. పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.     

  • Loading...

More Telugu News